పల్నాడుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ
పల్నాడు జిల్లాలో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ నియమించింది
tdp, candidate, mlc of local bodies, visakha district
పల్నాడు జిల్లాలో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడేందుకు జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక కమిటీని నియమించారు. ఈ కమిటీ అక్కడకు వెళ్లి టీడీపీ కార్యకర్తలకు అండగా నిలవాలని చంద్రబాబు నేతలను ఆదేశించారు.
ఏడుగురు సభ్యులతో...
కమిటీ సభ్యులుగా వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, బొండా ఉమామహేశ్వరరావు , కొల్లు రవీంద్ర, లావు శ్రీ కృష్ణదేవరాయులు, జంగా కృష్ణమూర్తి జూలకంటి బ్రహ్మా రెడ్డి ఉంటారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ కమిటీ నిజనిర్ధారణ చేసి పార్టీకి నివేదిక అందిస్తుందని తెలిపారు.